` అవసరాలకు అనుగుణగా నూతన కోర్సులు
` డిమాండ్ కలిగిన విభాగాలలో సీట్ల పెంపు
` ఆర్ట్స్ విద్యార్థులకు సైతం లక్షల రూపాయల వేతనాలు
` ఏయూలో ఉన్నత విద్యకు విదేశీయులు సైతం ఆసక్తి
` ప్లేస్‌మెంట్స్ భారీగా పెరగడంతో ఏయూలో ప్రవేశాలకు భారీ డిమాండ్
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 7: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పీజీ కోర్సులకు డిమాండ్ ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తోంది. ఆర్ట్స్, సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. డిమాండ్‌కి అనుగుణంగా సైన్స్ కోర్సుల్లో సీట్లను సైతం పెంపుదల చేసి ప్రవేశాలు కల్పిస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా వర్సిటీలో ప్లేస్‌మెంట్స్ నిర్వహణ, ఆర్ట్స్, సైన్స్ కోర్సుల విద్యార్థులకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు ధీటుగా భారీ వేతనాలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తుండటంతో పీజీ కోర్సుల్లో ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భారతీయ విద్యార్థులతో పాటు పెద్ద సంఖ్యలో విదేశీ విద్యార్థులు సైతం ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆసక్తి చూపుతున్నారు. అత్యున్నత ప్రమాణాలతో అధునాతన మౌలిక వసతులతో విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేస్తున్న విధానమే దీనికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి దార్శనిక నిర్ణయాలు వర్సిటీకి మంచి పేరు ప్రతిష్టలను తీసుకువస్తున్నాయి.
సైన్స్ కోర్స్‌లకు భారీ డిమాండ్….
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో సైన్స్ కోర్సులకు భారీ డిమాండ్ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రతిభ కలిగిన విద్యార్థులు మాత్రమే ఇక్కడ ప్రవేశాలు పొందడం జరుగుతుంది. సైన్స్ కళాశాల పరిధిలో 30 కోర్సులను నిర్వహిస్తున్నారు. వీటిలో ఉపాధి అవకాశాలు, డిమాండ్ అధికంగా ఉన్న స్టాటస్టిక్స్ విభాగంలో 40, బోటనీలో 40, బయోటెక్నాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్సుల్లో 20, అనలిటికల్ కెమిస్ట్రీ,మైక్రోబయాలజీ 15, జువాలజీ, ఫిజికల్ కెమిస్ట్రీ, మెరైన్ బయోటెక్నాలజీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫుడ్`న్యూట్రిషన్, డైటిక్స్‌లో 10 సీట్లు పెంచారు.
` పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గత సంవత్సరం నూతన విద్యావిధానానికి అనుగుణంగా మల్టీ ఎంట్రీ, మల్టీ ఎగ్జిట్ విధానంలో ఐదు సంవత్సరాల కాలవ్యవధి కలిగిన ఫుడ్ సైన్స్, టెక్నాలజీ కోర్సును ప్రారంభించి,విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
– ఏయూలో ఆచార్యుల కొరతను అధిగమించే విధంగా అధికారుల సఫలీక్నృలయ్యారు. దీనిలో భాగంగా యూజీసీ సూచించిన విధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల తరహాలో హానరరీ ప్రొఫెసర్, అడ్జంక్ట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ ఆన్ ప్రాక్టీస్‌లను తీసుకోవడం జరిగింది.
– పోస్ట్ డాక్టరల్ ఫెలో(ఫిడిఎఫ్) కలిగిన వారిని బోధనలో వినియోగిస్తున్నారు.
– యూజీసీ అందించిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు సైతం ఏయూలో పనిచేస్తున్నారు.
– సైన్స్ కళాశాల పరిధిలో 82 శాతానికి పైగా విద్యార్థులు ఉపాధి అవకశాలు సాధించారు. ప్రత్యేకంగా కెమిస్ట్రీ కోర్సులో శతశాతం ఉద్యోగాలు సాధిస్తున్నారు.
– సిలబస్ లో కాలానుగుణంగా మార్పు చేయడం, రెండు మూక్ కోర్సులు, రెండు యాడెడ్ కోర్సులు, ఇంటర్న్ షిప్లో భాగం చేసింది. మేధోహక్కులు(ఐపిఆర్) వంటివి దీనిలో ఉన్నాయి.
– అధునాతన ప్రయోగశాలలు, ఉపకరణాలు విద్యార్థులకు ఉపయుక్తంగా నిలుస్తున్నాయి
ఆర్ట్స్ కోర్సులకు ఆదరణ అదరహో..
గడచిన మూడు సంవత్సరాల కాలంలో ఆర్ట్స్ కోర్సులకు ఆదరణ పెరుగుతూ వస్తోంది. చరిత్ర, అర్ధశాస్త్రం, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులకు పూర్తిస్థాయిలో ప్రవేశాలు జరుగుతున్నాయి.
` డిగ్రీ కళాశాలల నుంచి డిప్యుటేషన్ పై వచ్చిన అధ్యాపకులతో ఆర్ట్స్ కళాశాలలో ఆచార్యుల కొరత కొంత వరకు తీరింది
` బోధన, పరిశోధన, పరిపాలనా సంబంధ అంశాలలో వీరు చురుకైన భూమిక పోషిస్తున్నారు.
` గతంలో లేని విధంగా ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు సైతం మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
` పీజీ కోర్సుల్లో పరిశీలిస్తే ఎంబిఏ విద్యార్థికి అత్యధికంగా రూ 15 లక్షల వేతనంతో ఉద్యోగం లభించింది. లైబ్రరీ సైన్స్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్,హిస్టరీ, ఎడ్యుకేషన వంటి విభాగాల విద్యార్థులకు సైతం రూ 3 నుంచి 14 లక్షల వరకు వార్షిక వేతనాలతో మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాయి ` ఏయూలో పీజీ కోర్సులను అభ్యశించడానికి పెద్దసంఖ్యలో విదేశీ విద్యార్థులు సైతం ఆసక్తి చూపుతున్నారు.
డిమాండ్ గణనీయంగా పెరుగతోంది…
ఏయూలో సైన్స్ కోర్సులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. దీన దృష్టిలో ఉంచుకుని ఎక్కువమంది పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యను పొందే విధంగా సీట్ల సంఖ్యను పెంచడం, మౌలిక వసతులు, హాస్టల్ వసతి ఏర్పాటు అధికారులు చేపడుతున్నారు.
` ఆచార్య కె.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్, సైన్స్, టెక్నాలజీ కళాశాల, ఏయూ
ఆర్ట్స్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి..
ఆర్ట్స్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పనపై ఏయూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. దీనిలో భాగంగా ప్రత్యేకంగా ప్లేస్మెంట్ అధికారిని నియమించి ఉపాధి అవకాశాలను పెంచారు. ఈ సంవత్సరం 15 లక్షలకు పైగా వార్షిక వేతనంతో పదుల సంఖ్యలో విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక కావడం డిమాండ్ ను మరింత పెంచుతుంది.
` ఆచార్య ఏ.నరసింహారావు, ప్రిన్సిపాల్, ఆర్ట్స్, కామర్స్ కళాశాల, ఏయూ