ఢిల్లీ న్యూస్లీడర్, ఆగస్టు 7 : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో మళ్లీ అడుగు పెట్టనున్నారు. ఆయనపై వేసిన అనర్హతను ఎత్తివేస్తున్నట్లు లోక్సభ సచివాలయం సోమవారం ప్రకటించింది. ‘మోడీ ఇంటిపేరు’పై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాహుల్ మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టనుండటంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వయనాయ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.