. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హాస్పటల్ ఎండీకి గద్దర్ తుది లేఖ . ప్రజల పాటకు నా ప్రాణమని మాటిచ్చినా… . నా ఆరోగ్య పరిస్థితిని ప్రజలకు తెలియజేయండంటూ విజ్ఞప్తి
హైదరాబాద్ అపోలో స్పెక్ట్రమ్ ఆసుపత్రి చైర్మన్ అండ్ ఎండీ గారికి గాయపడిన ప్రజల పాట అభ్యర్ధిస్తోంది. నా పేరు గుమ్మడి విఠల్, నా పాట పేరు గద్దర్. జనం తరుఫున బతుకే నా పోరాటం. నా వయస్సు 74 ఏళ్లు. నా వెన్నుపూసలో ఉండే తూటా వయసు 25 ఏళ్లు. జనం సమస్యలు తెలుసుకోడానికి ఇటీవల 1350 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. దీంతో ఆ గాయం ఎక్కువై ఇబ్బందులు పెడుతుండగా మీ దవాఖానాలో గత నెల 20న జాయినై చికిత్స పొందుతున్నాను. ప్రజల పాటే నా ప్రాణమని ప్రజలకు మాట ఇచ్చాను. నా ఆరోగ్య పరిస్థితిని నా ప్రజలకు మీ ద్వారా పత్రికా ప్రకటనతో తెలియజేయగలరు. ఈ లేఖను గత నెల 31వ తేదీన ఎండీకి రాశారు. . వందనాలతో… ఇట్లు … మీ గద్దర్