విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 7 : ప్రముఖ ప్రజాగాయకుడు, ‘యుద్ధనౌక’ గద్దర్‌కు ఉత్తరాంధ్ర ప్రాంతంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఈ ప్రాంతంలో జరిగిన ఉద్యమాలు, ఇక్కడి జానపద కళాకారులతో సాన్నిహిత్యం ఉంది. ఏ చిన్న అవకాశం వచ్చినా గద్దర్ ఉత్తరాంధ్ర జానపదాలు, ఇక్కడి సంస్కృతి గురించి చెప్పేవారు. అందుకే గద్దర్ తిరిగి లోకాలకు వెళ్లిపోయారన్న సంగతి తెలియగాని ఈ ప్రాంతం చిన్నబోయింది. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని పలువురు ప్రముఖులు నెమరు వేసుకొని అనుభవాలను పంచుకుంటున్నారు.
ఓ సందర్భంలో గద్దర్ విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన ‘లీడర్’ అధిపతి, ప్రముఖ జర్నలిస్టు వీవీ రమణమూర్తిని కలిశారు. అప్పుడు దిగిన ఫోటో ఇది. ఇందులో గద్దర్‌తో పాటు వీవీ రమణమూర్తి, నటుడు ఆర్.నారాయణమూర్తి, జానపద గాయకులు విమలక్క, ఉష తదితరులు ఉన్నారు.