ఒంటరి మహిళను వాలంటీర్ ప్రేమ పేరుతో నమ్మించి, వివాహేతర సంబంధం కొనసాగించి.. ఇప్పుడు ముఖం చాటేశాడంటూ ఓ ఒంటరి మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం గ్రామానికి చెందిన మహిళ భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నారు.
అదే గ్రామానికి చెందిన వాలంటీర్ శివప్రసాద్ ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. మూడేళ్లగా తన అవసరం తీర్చుకుని, ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత మహిళ సోమవారం గొలుగొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులను సంప్రదించగా ప్రస్తుతం ఎస్సై అందుబాటు లేరని, ఆమె ఇచ్చిన ఫిర్యాదును విచారించి తదుపరి వివరాలు వెల్లడిస్తామన్నారు