తన గదిలో ఉరివేసుకున ఆత్మహత్య మానసిక ఒత్తిడికి లోనవుతున్నానంటూ లేఖ రాసి బలవన్మరణం ఒడిశా వాస్తవ్యుడిగా గుర్తింపు
హైదరాబాద్, న్యూస్లీడర్, ఆగస్టు 8: ఐఐటీ హైదరాబాద్లో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న మమైత నాయక్ మానసిక ఒత్తిడి కారణంగా ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెలలో మరో విద్యార్థి కార్తిక్ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో మమైత నాయక్ ఇలా బలవంతంగా జీవితాన్ని ముగించడం కలకలం రేపుతోంది. సంగారెడ్డి గ్రామీణ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మమైత నాయక్ సోమవారం తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల 26నే అతడు ఎంటెక్ ప్రథమ సంవత్సరంలో చేరాడు. ఆ రోజు సాయంత్రం ఇతర విద్యార్థులు జరిగిన దారుణాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు. మానసిక ఒత్తిడికి గురవుతున్నా’’ అని రాసున్న లేఖ మమైత గదిలో పోలీసులకు లభించింది.