సంప్‌లో పిల్లల్ని తోసేసి, తల్లి కూడా ఆత్మహత్య
ఉపాధి కోసం నగరానికి వచ్చి ముగ్గురి బలవన్మరణం
కారణాలు ఆరా తీస్తున్న పోలీసులు
వాచ్‌మన్ కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్న సిబ్బంది
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 9: మహా విశాఖలో మరో ఘోరం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లోని వాటర్ సంప్‌లో ఇద్దరు పిల్లల్ని పడేసి, తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళవారం రాత్రి జరిగింది. కారణాల్ని పోలీసులు అన్వేషిస్తున్నారు. బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్ని వెస్ట్‌జోన్ ఏసీపీ అన్నెప్పు నర్సింహమూర్తి మీడియాకు తెలియజేశారు. మర్రిపాలెం వుడా లే అవుట్ ప్రకాశ్ నగర్లో ఉన్న ప్రకాశ్ అపార్ట్మెంట్లో బొబ్బిలికి చెందిన లక్ష్మణ్ కొన్నాళ్ల క్రితం వాచ్‌మన్‌గా కుదిరాడు. ఆయనకు భార్య సంధ్య (20), గౌతమ్ (7), అలేఖ్య (5) ఉన్నారు. వీరంతా అపార్ట్మెంట్లోని ఓ గదిలో ఉంటూ ఇళ్లల్లో పనులు చేసుకుంటున్నారు. మంగళవారం రాత్రి గదిలో ఉండాల్సిన భార్య, పిల్లలు కనిపించకపోవడంతో లక్ష్మణ్ ఈ విషయాన్ని మొదటి అంతస్తులో ఉంటున్న ఓ యజమానికి చెప్పగా వారు డయల్ 100కు సమాచారం అందజేశారు. గస్తీ పోలీసులొచ్చి ఆరా తీయగా సెల్లార్‌లోని సంప్పై మూత తీసి ఉండడాన్ని గుర్తించారు. దీంతో సంప్‌లో కర్రపెట్టి చూడగా తొలుత సంధ్య మృతదేహం, ఆ తర్వాత పిల్లల మృతదేహాలు కనిపించాయి. దీంతో సీఐ బీఎండీ ప్రసాద్ రంగంలోకి దిగి వివరాలు ఆరా తీశారు.
అన్యోన్యంగానే ఉంటారు
లక్ష్మణ్, సంధ్య దంపతలు అన్యోన్యంగానే ఉంటారని అక్కడి వారితో పాటు సంధ్య కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులు గుర్తించారు. అయితే ఆమె తన పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఇప్పటికీ తెలియకపోవడంతో ఆందోళన నెలకొంది. అంతేకాకుండా సంధ్య వాడుతున్న సెల్‌ఫోన్ కూడా నీటిలో పడి పోవడంతో పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు మొదలెట్టారు. సంధ్య తన పెద్దమ్మతో కాస్త చనువుగా ఉంటుందని తెలియడంతో వారిని కూడా రప్పిస్తున్నారు. ఉపాధి కోసం బొబ్బిలి నుంచి వచ్చి పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడాల్సిన ఆఘాయిత్యం ఏమొచ్చిందోనని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాచ్‌మన్ లక్ష్ష్మణ్ కూడా తనకేమీ తెలియదని చెబుతున్నాడు. రాత్రి వేళ సంఘటన జరగడం, సంప్‌లో నీటిని కూడా తోడిరచేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.