` ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ ఆరోపణ ` మండిపడిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
ఢిల్లీ, న్యూస్‌లీడర్, ఆగస్టు 9 : అవిశ్వాసంపై జరిగిన చర్చలో తన ప్రసంగం ముగిసిన తరువాత రాహుల్ గాంధీ లోక్‌సభ నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ సమయంలో ఆయన ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ మహిళా ఎంపీలు ఆరోపించారు. దీనిపై స్మృతి ఇరానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఇలాంటి ప్రవర్తన ఇంతకుముందు చూడలేదన్నారు.
రాహుల్ తీరును ఖండిస్తూ.. స్త్రీ వ్యతిరేకులు మాత్రమే పార్లమెంట్లో ఇలాంటి పనులు చేస్తారు. ఇలాంటివి ఇంతవరకు చూడలేదు. దీన్నిబట్టి ఆయన మహిళల గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇట్టే చెప్పేయవచ్చు. ఇది అసభ్యకరమైన ప్రవర్తన అంటూ మండిపడ్డారు. సభలో రాహుల్ అనుచితంగా ప్రవర్తించారంటూ స్పీకర్‌కు కేంద్రమంత్రి శోభా కరంద్లాజే, కొందరు మహిళా ఎంపీలు ఫిర్యాదు చేశారు. మహిళా ఎంపీలు సంతకాలు చేసిన లేఖను స్పీకర్‌కు అందించారు. కాంగ్రెస్ నేతపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.