బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో పదమూడేళ్ల బాలికపై ఆరుగురు కామాంధులు 28 రోజులపాటు అత్యాచారాలకు పాల్పడ్డారు. సరైయా పోలీస్‌స్టేషను పరిధిలో జులై 9న కొందరు దుండగులు కారులో వచ్చి బాలికను కిడ్నాప్ చేశారు. శిథిలావస్థలో ఉన్న ఓ భవనంలో ఆమెను నిర్బంధించి గత 28 రోజులుగా అకృత్యాలు సాగించారు.
ఆగస్టు 5న బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిందితులు.. బాధితురాలి తల్లికి ఫోను చేసి కుమార్తెను తీసుకువెళ్లమని చెప్పారు. అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను ఆస్పత్రికి తరలించిన తల్లి.. జులై 9న తాను ఫిర్యాదు చేసినపుడే పోలీసులు స్పందించి ఉంటే తన కుమార్తెకు ఈ దుర్గతి పట్టేది కాదని రోదిస్తోంది. పరారీలో ఉన్న నిందితుల కోసం సరైయా పోలీసులు గాలిస్తున్నారు.
యూపీలోని గాజియాబాద్‌కు చెందిన వివాహితను ఉద్యోగం పేరుతో మభ్యపెట్టి హరిద్వార్ (ఉత్తరాఖండ్)కు తీసుకువచ్చిన నదీమ్.. మహ్మద్ షకీబ్ అనే వ్యక్తికి ఆమెను అప్పగించాడు. షకీబ్ ఆమెను నిర్బంధించి మత్తుమందు ఇచ్చి 22 రోజులపాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తప్పించుకొన్న బాధితురాలు హరిద్వార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.