సూపర్ స్టార్ కృష్ణ హీరోగా సూపర్ ఫాం లో ఉన్నప్పుడే తన తనయులు ఇద్దరిని తెరం గేట్రం చేయించాడు. కృష్ణ పెద్ద కొడుకు రమేష్ ని హీరోగా పరిచయం చేయగా మహేష్‌ని మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇంట్రడ్యూస్ చేశారు. సినిమాతో మొదలైన మహేష్ సినిమా కెరీర్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేసి ఆడియన్స్‌ని మెప్పించా డు. ఇక రాజకుమారుడుతో హీరోగా చేసిన మహేష్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకు న్నాడు. మురారి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన మహేష్ ఒక్కడుతో యూత్ ఆడియన్స్ ని మెప్పించాడు. పోకిరితో ఇండస్ట్రీ రికార్డులను బద్ధలు కొట్టాడు. దూకుడు, బిజినెస్ మ్యాన్, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సర్కారు వారి పాట ఇలా తను చేస్తున్న సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమ సత్తా చాటుతూ వస్తున్నాడు మహేష్. స్టార్ ఇమేజ్ వచ్చాక పూర్తిగా కమర్షియల్ సినిమా చేసినా వర్క్ అవుట్ అవుతుంది. కానీ ఒక సినిమా చేస్తున్నాం అంటే అందులో ఏదో ఒక కథ ఉండాలని కోరుకునే హీరో మహేష్. అప్పట్లో కృష్ణ ఎలాగైతే ప్రయోగాలు చేశారో ఈ తరంలో మహేష్ కూడా అలానే రకరకాల ప్రయోగాలు చేస్తూ వచ్చారు. స్టార్ హీరోలు రిస్క్ చేస్తే ఆ సినిమాల ఫలితాలు కూడా వారి కెరీర్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తాయి. అయినా సరే ఎక్కడా తగ్గకుండా మహేష్ సినిమాలు చేస్తూ వచ్చాడు. హీరోగా తన స్థాయిని పెంచుకుంటూ వచ్చి సూపర్ స్టార్ ట్యాగ్‌ని సొంతం చేసుకున్నాడు మహేష్. కేవలం స్టార్ హీరో గానే కాదు మంచి మనిషిగా కూడా మహేష్ అభిమానుల మనసులు గెలుస్తున్నాడు. సమాజ సేవలో కూడా మహేష్ ఎప్పుడూ ముందుంటాడు. ఆల్రెడీ మహేష్ ఏపీలో ఒక గ్రామం, తెలంగాణాలో మరో గ్రామం దత్తత తీసుకుని డెవెలప్ చేశారు. ఇక మరోపక్క ఆంధ్రా హాస్పిటల్ తో కలిసి చిన్న పిల్లల గుండె ఆపరేషన్ లకు సహాయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు 1200 పైగా పిల్లలకు మహేష్ ఆపరేషన్ చేయించి వారు హృదయాలను గెలిచాడు. మహేష్ కటౌట్‌కి సరైన కథ పడితే చాలు అది రికార్డులు సృష్టించడం ఖాయం. ప్రస్తుతం మహేష్ త్రివిక్రం డైరెక్షన్లో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.