యువహీరో వరుణ్ ధావన్ బ్యాక్ టు బ్యాక్ సౌత్ డైరెక్టర్లపై ఆధారపడడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓవైపు బాలీవుడ్ అగ్ర హీరోలు షారూఖ్ ఖాన్, సల్మాన్‌ఖాన్, రణబీర్‌కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి నటులు దక్షిణాది డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. భారీ బ్లాక్ బస్టర్లను అందు కుంటున్నారు. బిగ బి అమితాబ్ బచ్చన్ ఏకంగా సౌత్ లో క్రేజీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇంతలోనే బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ప్రణాళికలు ఆశ్చర్యపరుస్తున్నాయి. అతడు ఇప్పుడు వరుసగా సౌత్ డైరెక్టర్లతో పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. జవాన్ ఫేం అట్లీతో ఓ భారీ సినిమా చేయ బోతున్నట్లు కొంతకాలం క్రితం వార్తలు వస్తున్నాయి. వరుణ్ దానిపై ఎక్కువ వివరాలను వెల్లడిరచనప్పటికీ ఇప్పటికే అతడు కథను లాక్ చేసాడు. త్వరలో వి.డి.18ని ప్రారంభించబోతున్నట్లు చెప్పాడు. నేటి నుండి ఈ చిత్రం నుండి షూటింగ్ ప్రారంభించ బోతున్నట్లు తెలిసింది. సినిమా విడుదల తేదీని 31 మే 2024 అని కూడా ప్రకటించాడు. వరుణ్ ధావన్- అట్లీ కాంబినేషణ్ చిత్రాన్ని మురాద్ ఖేతానితో కలిసి ధావన్ నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్- వామికా గబ్బి (వరుణ్‌తో పాటు చివరిసారిగా జూబ్లీలో కనిపించారు) నాయికలుగా నటించనున్నారు. ఇక జవాన్‌లో షారూఖ్‌ని సరికొత్త అవతారంలో ఆవిష్కరి స్తున్న వరుణ్ని పూర్తిగా కొత్త అవతార్‌లో చూపించ నున్నాడని తెలుస్తోంది.