వెస్టిండీస్ గడ్డపై భారత్ ఘన విజయంతో టీ20 సిరీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. గయానా వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీమ్ 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే భారత్ 164/3తో ఛేదించేసింది. దాంతో ఐదు టీ20ల సిరీస్‌ని కూడా 1-2తో భారత్ సజీవంగా ఉంచుకుంది. ఇక నాలుగో టీ20 శనివారం రాత్రి జరగనుంది.
తొలి రెండు టీ20ల్లో ఫెయిలైన సూర్యకుమార్ యాదవ్.. మూడో టీ20లో కేవలం 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో ఏకంగా 83 పరుగులు చేశాడు. అతనితో పాటు తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ కూడా 37 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేశాడు.
వెస్టిండీస్ టీమ్‌లో రోవ్‌మెన్ పొవెల్ 19 బంతుల్లోనే ఒక ఫోర్, మూడు సిక్సర్ల సాయంతో అజేయంగా 40 పరుగులు చేశాడు. అతనితో పాటు ఓపెనర్ బ్రాండన్ కింగ్ 42 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌కి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నారు.