మాయమాటలతో బాలికతో పాటు మొత్తం నలుగురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న 25 యేళ్ళ వ్యక్తిని సేలం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు… కన్నియాకుమారి
జిల్లా ఇరుళ్పురం అనే గ్రామానికి చెందిన విశ్వ (25) 2022లో కృష్ణగిరిలోని ఒక వస్త్ర దుకాణంలో పని చేసేవాడు.
ఆ దుకాణంలో పనిచేసే ఒక మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత ఆమెను వదిలేసి అదే ప్రాంతంలోని ఒక జ్యూస్ షాపులో పనికి చేరాడు. ఆ దుకాణానికి వచ్చే భర్త చనిపోయిన 40 యేళ్ళ మహిళను తన మాయమాటలతో లోబరుచుకు న్నాడు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆమెను పెళ్ళి చేసుకున్న విశ్వ… తన మకాంను సేలంకు మార్చాడు.
ఈ క్రమంలో పొరుగింటి మహిళతో విశ్వకు పరిచయం ఏర్పడటం, ఆమెను కూడా లోబరుచుకున్నాడు. ఈ విషయం రెండో భార్యకు తెలిసింది. దీంతో రెండో భార్య, ఆమె ఇద్దరు కుమార్తెలు, వివాహేతర సంబంధం పెట్టుకున్న మూడో మహిళ .. వీరంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు. కొద్ది రోజుల తర్వాత రెండో భార్య, ఆమె ఇద్దరు కుమార్తెలను మరో వీధిలో ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడకు మకాం పెట్టాడు. ఆ ఇంటికి వెళ్ళి వచ్చే క్రమంలో రెండో భార్య రెండో కుమార్తెను మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక బంధువులు అంబాపేట ఆల్ ఉమెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విశ్వను పోలీసులు అరెస్టు చేసి విచారించగా అతని బండారం బయటపడింది.