ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ కార్యదర్శి ఎం.సత్యనారాయణ రాజు
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 9: ఆంధ్రప్రదేశ్‌లోని మొటమొదటిసారిగా విశాఖలో ఫ్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) ‘వైజాగ్ ఓపెన్’ టోర్నమెంట్ నిర్వహిస్తోందని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ కార్యదర్శి ఎం.సత్యనారాయణ రాజు పేర్కొన్నారు. ముడసర్లొవలోని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీజీటీఐ టోర్నమెంట్ వివరాలు వెల్లడిరచారు. సెప్టెంబర్ 18 నుంచి 23వ తేదీ వరకు పీజీటీఐ టోర్నమెంట్‌కు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుందన్నారు. భారతదేశంతో పాటు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ తదితర దేశాల 126 మంది అత్యుత్తమ గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. విజేతకు రూ.కోటి అందజేస్తామని, అంతేకాకుండా ఈ అధికారక ప్రపంచ గోల్ఫ్ ఆటలో వచ్చిన ర్యాంకింగ్ పాయింట్స్ అన్నీ వారు పాల్గొనే ఒలంపిక్స్, ఇతర ప్రపంచ ఈవెంట్స్‌కు అర్హత సాధించేందుకు దోహదపడతాయన్నారు. ఈ టోర్నమెంట్ యూరో స్పోర్ట్స్, సోషల్ మీడియా స్ట్రీమింగ్ ఏబీపీ న్యూస్, దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందన్నారు.
విశాఖ బ్రాండిరగ్లో పీజీటీఐ టోర్నమెంట్ ప్రధాన పాత్ర..
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ బ్రాండిరగ్లో పీజీటీఐ టోర్నమెంట్ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. పీజీటీఐ టోర్నమెంట్ విజయవంతమైన తరువాత ఈపీజీసీ గోల్ఫ్ క్లబ్‌కు ప్రపంచ గోల్ఫ్ పటంలో ఒక ఖచ్చితమైన స్థానం లభిస్తుందన్నారు. ఈ టోర్నమెంట్ గోల్ఫ్ ప్రమాణాలు, ఆతిథ్యం, పర్యాటక రంగాన్ని ప్రొత్సహించడమే కాకుండా దేశంలో ఉన్న పారిశ్రామిక సంస్థలను ఆకర్షిస్తుందన్నారు. ఈపీజీఎస్ 1984లో ఈపాయింట్ కోలనీ ఉడా పార్క్ దగ్గర స్థాపించారని, భారతదేశంలో ఇది రెండవ గోల్ఫ్ క్లబ్ అని, 1964 నుండి ముడసర్లొవలో వంద ఎకరాల్లో ఈ గోల్ఫ్ క్లబ్ ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా తెలిపారు. అప్పటి నుంచి క్రమక్రమంగా పెరుగుతూ చివరకు ఫిబ్రవరి 2021లో ఛాంపియన్షిప్ గోల్ఫ్ క్లబ్ గా ప్రపంచే ప్రమాణాలతో అవతరించిందన్నారు. జీఐఏ సమ్మిట్ ఢల్లీి వారిచే గత ఏడాది ఈపీజీసీ ఉత్తమ పుననిర్మాణ గోల్ఫ్ కోర్సు అవార్డు అందుకుందన్నారు. ఈ అవార్డు రావడానికి దాతలు, క్లబ్ సభ్యులు, ప్రభుత్వ అధికారుల నుంచి మద్దతు ముఖ్య కారణమన్నారు.
పీజీటీఐ టోర్నమెంట్ మార్కెటింగ్ హెడ్ Ê టూర్ డెవలప్మెంట్ వికాస్ సింగ్ మాట్లాడుతూ ఈపీజీఎస్ కమిటీ సభ్యులు చేసిన ఏర్పాట్లు తీరు చూసి మెచ్చుకోలేకుండా ఉన్నానని, ఇప్పుడు జరిగే టోర్నమెంట్ వివరాలే కాకుండా ఇకముందు జరగబోయేవి కూడా అంతర్జాతీయ గోల్ఫ్ క్యాలెండరులో వరల్డ్ ర్యాంకింగ్ వివరాలతో నమోదు చేయబడతాయని ప్రశంశించారు. టోర్నమెంట్ జరిగే ఆరు రోజులు ఇక్కడ మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా పోటీలు లైవ్‌లో చూసేందుకు మూడు చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఈ సమావేశంలో ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ (ఈపీజీసీ) కోశాధికారి పి.రామకృష్ణరావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు పీవీఎల్ఎన్ రాజు, ఎస్వీహెచ్ రాజేంద్ర, డి.టి.రాజు, జి.విజయకుమార్, డి.కృష్ణ ప్రసాద్, కెప్టెన్ ఎం.వి.ఎస్.కుమార్, ప్రభాస్, శివాజీ పాల్గొన్నారు.