అమరావతి, న్యూస్లీడర్, ఆగస్టు 10: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పర్యటించనున్నారు. వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. ఆరోజు ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అమలాపురం చేరుకుంటారు. అమలాపురం మండలం జనుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగం అనంతరం, వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తారు. సభ అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.