ప్రధాని షరీఫ్ సలహా మేరకు నిర్ణయం తీసుకున్న అధ్యక్షుడు అరిఫ్ అల్వీ
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రద్దయింది. ప్రధాని షెప్ాబాజ్ షరీఫ్ సలహా మేరకు ఆ దేశ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించారు.
అంతకు ముందు జాతీయ అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షుడికి లేఖ రాశారు. దీంతో బుధవారం అర్ధరాత్రి పాక్ అధ్యక్షుడు అల్వీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ పత్రిక డాన్ పేర్కొంది. ఈ నిర్ణయంతో పాకిస్థాన్ పార్లమెంట్ దిగువ సభతో పాటు ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మూడు రోజుల ముందస్తుగానే రద్దయింది. దీంతో త్వరలోనే ఆ దేశానికి ఎన్నికలు జరగనున్నాయి.
బుధవారం పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రధానిగా షప్ాబాజ్ షరీఫ్ చివరి ప్రసంగం చేశారు. అనంతరం.. సభ అనుమతితో జాతీయ అసెంబ్లీ రద్దు చేయాలని అధ్యక్షుడికి చెప్పాలనుకుంటున్నట్లు వెల్లడిరచారు. ఇక గడువు కంటే మూడు రోజుల ముందే జాతీయ అసెంబ్లీ రద్దవడంతో ఎన్నికల సంఘం 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం తన పదవీ కాలాన్ని పూర్తి చేసినట్లైతే 60 రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండేది. పాక్లో కొత్త జనాభా గణన ఫలితాలు రావడంతో ఎన్నికలకు ముందే నియోజక వర్గాల విభజన చేయాల్సి ఉంది. 120 రోజుల్లో డీలిమిటేషన్ నిర్వహించి ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావించింది. అయితే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వేగంగా చేయడం, 90 రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించడం సాంకేతికంగా సాధ్యమే అయినప్పటికీ ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. అయితే గడువులోగా కాకుండా రెండు నెలల పాటు ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018 జులై 25న ఆ దేశ ఎన్నికలు జరిగాయి. 2018 ఆగస్టు 13న 15వ పాక్ జాతీయ అసెంబ్లీ కొలువు దీరింది. ఇక ఎన్నికలు నిర్వహించే వరకు దేశంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగనుంది.