మహారాష్ట్రలోని నాగ్‌పుర్ జిల్లా హింగ్నా పోలీస్‌స్టేషను పరిధిలో నాలుగేళ్ల బాలుడు టీవీ సెట్‌టాప్ బాక్సు పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. అప్పటిదాకా టీవీలో కార్టూన్లు చూస్తూ ఆనందంగా గడిపిన చిన్నారి విగతజీవిగా మారడం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చాటే ఈ ఘటన మంగళవారం జరగ్గా.. బుధవారం వెలుగులోకి వచ్చింది. తండ్రి ఇంట్లో పడుకొని ఉండగా.. టీవీ చూస్తున్న బాలుడు సెట్‌టాప్ బాక్సును లాగే ప్రయత్నం చేశాడు. విద్యుదాఘాతం సోకి మృత్యువాతపడ్డాడు.