ఆరిలోవ, న్యూస్‌లీడర్, ఆగస్టు 11: విశాఖ జాతీయ రహదారిపై ఓ కారు కాలిబూడిదైంది. వెంకోజీపాలెంలోని మెడికవర్ ఆస్పత్రి దాటాక, పండ్ల దుకాణాల సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 1.45గంటల సమయంలో ఓ వాహనం అగ్నికి ఆహూతైంది. నడిరోడ్డుపై వాహనం మంటల్లో చిక్కుకోవడం చూసి అక్కడివారు బెంబేలెత్తిపోయారు. దట్టంగా పొగలు కమ్మేయడం, భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో దూరం జరిగారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న వ్యక్తులు బయటకు దూకేశారని అక్కడి వారు చెబుతున్నారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే కారుకు మంటలు వ్యాపించాయని, ఎవరికీ ఏమీ కాలేదని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.