న్యూ ఢిల్లీ, న్యూస్లీడర్, ఆగస్టు 10: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వమన్నా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపమన్నా.. అవి విధానపరమైన నిర్ణయాలంటూ తప్పించుకుంటావ్ కదా చెల్లమా! ఫక్తు టీడీపీ ఏజెంట్లా మారిపోయి, మీ పార్టీ కన్నా సామాజికవర్గం, బావగారి పార్టీ ఎక్కువై పోయిందా అమ్మా పురంధేశ్వరి ? కేంద్రానికి టీడీపీ ఎందుకు మద్దతిస్తున్నదో అడిగావా అమ్మా ? అని సాయిరెడ్డి ట్వీట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.