విశాఖలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర
విశాఖపట్నం, న్యూస్లీడర్, ఆగస్టు 10: విశాఖ జగదాంబ సెంటర్లో 25 ఏళ్ల క్రితం సుస్వాగతం సినిమా చేశానని, మళ్లీ ఇప్పుడు ప్రజల కోసం ఇక్కడే వారాహి సభలో మాట్లాడుతున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సంస్కృతి, సాహిత్యం విశాఖ నేర్పిందన్నారు. మూడో విడత వారాహి యాత్రలో భాగంగా విశాఖ జగదాంబ కూడలిలో ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి జగన్ నాయకుడు కాదని, ఓ వ్యాపారి అని పవన్ ధ్వజమెత్తారు. అన్నింటిలోనూ కమిషన్ అడుగుతాడు. నాకెంత ఇస్తావ్. జగన్ డబ్బు పిచ్చోడు. ఏం చేసుకుంటావ్ డబ్బుతో. జగన్ అనే వ్యక్తిపై మీరు కన్ను వేస్తే మరేమీ మిగలదు. ఒక్క అవకాశం జగన్ కి ఇస్తారా. ఎందుకు ఇవ్వకూడదో నేను చెప్తాను. మన ఆంధ్రాని ఎవరూ కాపాడుకోలేరు. రూ.60 ఉండే మందు రూ.160 చేసేశారు. మద్యపాన నిషేధం అన్నారు. మద్యం మీద రూ.30వేల కోట్లు సంపాధించాడు జగన్. సారా కొట్టు నుంచి అన్నింట్లోనూ జగన్కు వాటాలున్నాయి.
జగన్కు అధికారం ఇచ్చింది పాలించమని. పీడిరచమని కాదు..
ఒక్క కులం వాళ్ళకే పదవులు పంచేశారు. అదేనా రూలింగ్. నేను దానికి విరుద్ధం. జన సేన అధికారంలోకి వస్తే అన్ని కులాలకు ప్రాధాన్యం. జగన్ ఒక దొంగ. ఒక దోపిడీ దారు. నా మీద కేసులు వేసుకున్నా పరవాలేదు. కాగ్ కు లెక్కలు చూపించకుండా దోచేశారు. పంచాయతీలను కాపాడుకోవాలి. పంచాయతీల సొమ్మును వలంటీర్ల జీతాలకు ఇచ్చేశారు. అందుకే బ్లేచింగ్ కూడా లేదు. ప్రధాని తో మాట్లాడి గ్రామ వ్యవస్థను బలోపేతం చేస్తాం. గ్రామ సభలు నిర్వహిస్తాం.
పంచాయతీలకు సంబంధించి కోర్టుకు వెళ్ళండి..
జనసేన మీకు అండగా ఉంటుంది. జగన్ సూట్ కేసు కంపెనీలు పెట్టాడు. జగన్ ను పరవాడలో కూచోమను. కాలుష్యాన్ని పట్టించుకోరా. ఉత్తరాంధ్రను డంపింగ్ యార్డు చేసేశారు. మీరు ఆలోచించి ఓటేయకపోతే, ప్రశ్ని0చకపోతే మీరే నష్టపోతారు. జనసేన అధికారంలోకి వస్తే భూకబ్జాలు బయటకు తీస్తాం. ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతాం. కేంద్రం కూడా అన్నింటికీ సిద్ధంగా ఉంది. జగన్ సాఫ్ట్ వేర్ ఏం పెడుతున్నాడో చూడండి. మీరు బలైపోయే సాఫ్ట్ వేర్ అది..మీ శక్తిని మీరు గ్రహించండి. ఆలోచించి ఓటేయండి. ఎట్టి పరిస్థితుల్లో జగన్ మళ్లీ రాకూడదు. 2024లో జగన్ చేతికి అధికారం వెళ్లకూడదు. నా ప్రాధాన్యత కోసం అప్పట్లో ప్రదానికి వ్యతిరేక0గా వెళ్ళా. మీరెందుకు పారిపోతారు. జగన్ను పంపించేయండి.
కుదిరితే వైజాగ్లో ఇల్లు తీసుకుంటా….
మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే క్షణాల్లో అమరావతి నుంచి వచ్చేస్తా. గంధపు చెట్లు నరకడం ఎంత నేరమో..డేటా సేకరణ కూడా అంతే నేరం. మనందరం బావుండాలంటే జనసేన రావాలి. జగన్ ఎలా ఇంటికి పంపిద్దాం మీరే చెప్పండి. జై సేన సేన.
రోడ్ షో లో పోలీసుల ఓవరాక్షన్…
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ రోడ్ షో లో పోలీసుల ఓవరాక్షన్ కనిపించింది. సుధీర ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ చూడ్డానికి విచ్చేసిన వారిపై కొందరు పోలీసులు లాఠీ చార్జి చేయడంపై జన సైనికులు అసహనం వ్యక్తం చేశారు. సాయంత్రం ఐదు గంటలకు రోడ్ షో కాగా, అక్కడకు విచ్చేసిన వారిని బార్కెట్లను గేట్లుగా పెట్టి అనుమతించకపోవడంపై కొంతసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఈ తరుణంలో నగర శివారు పోలీస్ స్టేషన్కు చెందిన ఓ సిఐ లాఠీ చేత పట్టుకొని విరుచుకుపడడం అక్కడి వారిని విస్మయానికి గురి చేసింది. ప్రశాంతంగా పవన్ రోడ్ షో ముగిసింది అనుకున్న తరుణంలో పోలీసులు ఓవరాక్షన్ మచ్చగా మిగిలింది. అయితే రోడ్డు షో కు విచ్చేసిన వారికి జన సైనికులు వాటర్ ప్యాకెట్లు ఎక్కడికి అక్కడ అందించి, వారి దాహర్తిని తీర్చారు.
విశాఖలో పవన్ కళ్యాణ్ తూటాలు
విశాఖపట్నం, న్యూస్లీడర్, ఆగస్టు 10: జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖలో వారాహి విజయయాత్ర ఆదివారం నిర్వహించారు. జగదాంబ సెంటర్ లో మూడో విడత వారాహి యాత్ర కు సంబంధించి వేలాది జన వాహిని మధ్య రాత్రి 7గంటల సమయంలో మాట్లాడారు. బహిరంగ సభలో ఆయన పేల్చిన తూటాలివే..
– నటనలో ఓనామాలు దిద్దింది ఇక్కడే..ప్రశాంత విశాఖలో వైసీపీ అలజడి రేపింది
– మిమ్మల్ని బెదిరించిన వాళ్ళ తోలు తీస్తా
– ఉదయం ఇచ్చే పథకాల డబ్బు సాయంత్రం సారాకి వెళ్లిపోతోంది
– కాలం చాలా గొప్పది అని గద్దర్ చెప్పారు. ఉత్తరాంధ్రా జిల్లాలు అభివృద్ధి కావాలి
– బండెక బండి కడదాం..ఈ దేశానికి ఏదో ఒకటి ఇవ్వాలి. ఉద్యమ కారులతో మాట్లాడితే ఈ నేల మాది. ఈ నింగి మాది.
– ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసేశారు. జగన్ ని నేను ఏకవచనం తో పిలుస్తా. అందర్నీ భయపెడతావ్. ఎందుకు భయపడాలి. నువ్వు ఏమైనా దిగొచ్చావా
– ప్రాణాలకు తెగించి నేను రాజకీయాల్లోకి వచ్చా. ఎవరి బలిదానం మీద, ఈ ఆంధ్రని మనకు ఇచ్చిన వారిని మర్చి పోయావ్. మనకోసం త్యాగం చేసిన వాళ్ళను మర్చిపోకూడదు.
నేను అనుకోవడం కాదు..మీరనుకోవాలి..నేను ముఖ్యమంత్రిని కావాలి అని. వైసీపీ ఎమ్మెల్యేలు నోరేసుకొని పడిపోతున్నారు. దోపిడీలు చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వాళ్ళందర్నీ తన్ని తరిమేద్దాం. వైసీపీ రహిత రాజ్యాన్ని తెద్దాం.
కొండల్ని దోచేస్తున్నారు…
ఎలాంటి వ్యక్తులో మీకు తెలుసు. సీపీఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్ ఎక్కడ. స్టీల్ ప్లాంట్ ని ఎవరు పరిరక్షిస్తారు. తెలంగాణా స్ఫూర్తి కూడా ఆంధ్రాలో లేదు. ఋషికొండ ను ఎలా తవ్వేశారో.. తుపాన్లు వస్తే ఆపుతుంది. ఎర్ర మట్టి దిబ్బల్లో రియల్టర్లు దోచేశారు. నువ్వొచ్చి ఇక్కడ ఏం చేస్తావ్. సహజ వనరులు మనవి. ఇసుక అడ్డగోలుగా దోచేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల పొట్ట గొట్టారు.
నేను ఓడిపోతే విశాఖ మళ్లీ ప్రాణం పోసింది..
ఓడిపోతే నా దగ్గరకు ఎవరైనా వస్తారా..కానీ వాళ్ళ బాధలు చెబుతున్నారు. విశాఖ రుణం తీర్చుకోలేను. 10వేల మంది వైసీపీ అరాచకాల్ని అడ్డుకోలేరా..రాష్ట్రంలో 30వేల మంది పైచిలుకు మిస్ అయ్యారు. పార్లమెంట్ లో కూడా అదే మాట్లాడారు. మానవ అక్రమ రవాణా ఏపీ..విశాఖ నుంచి జరుగుతోంది. బూతులు తిట్టడమే పనా..ప్రజల కోసమే నేను వాళ్ళను తిడతాను. నేను ఏది మాట్లాడినా అధ్యయనం చేసే మాట్లాడతా. విశాఖలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వలంటీర్లు నా సోదరులు. కానీ వారు కొన్ని రహస్యాలు అడుగుతున్నారు. ఆ డేటా హైదరాబాద్ వెళ్తోంది.
నా సేవలు ప్రధానికి అవసరం అనుకున్నప్పుడు నన్ను పిలుస్తారు. నేను వెళ్తా. ఇక్కడ నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో కానీ మీరు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. పెందుర్తిలో ఒక వలంటీర్ వృద్ధురాల్ని చంపేసి నగలు పట్టుకెళ్లిపోయాడు. అలా ఏపీలో చాలా సంఘటనలు జరిగాయి. అందరూ అలా కాదు. చిత్తూరు ఎస్పీ వలంటీర్ల కోసం చాలా మాట్లాడారు. ఇప్పుడేమంటారు ఎస్పీ గారూ. ఆడపిల్లలు తప్పిపోతే జగన్ ఎందుకు సమీక్షలు జరపరు. గంజాయి ఇంతగా రవాణా అవుతుంటే ఏం చెబుతారు. విశాఖ ఎంపీ కుటుంబానికి ఇక్కడ దిక్కు లేదు. జగన్ లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం నాశనం ఖాయం. విద్యుత్ చార్జీలు భారంపై మాట్లాడరా..నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. ఏయూలో అరాచకాలు పెరిగిపోయ్యాయి. 29వ స్థానంలో ఉండేది. ఐదేళ్లు కాకముందే 77వ స్థానానికి వెళ్ళిపోయింది. గంజాయి అమ్ముతారు. వైసీపీ నాయకులు పుట్టిన రోజు చేసుకుంటారు. వీసీ ఓట్లు అడుగుతారు. మీరు పని చేస్తున్నది రాజకీయాల కోసమా..విద్యార్థుల కోసమా. నేను కేంద్రానికి ఫిర్యాదు చేస్తా. ఏయూను బ్రష్టు పట్టించారు. మా ప్రభుత్వం రాగానే మంచి పేరు తెస్తాం. జగన్ దోచుకుంటున్న జాబితా అంతా కేంద్రం వద్ద ఉంది. హోమ్ మంత్రి అమిత్ షా కూడా విశాఖలో అసాంఘిక కార్యక్రమాల కోసం చెప్పారు. కేంద్రం ఇస్తున్న పథకాల మీద జగన్ స్టిక్కర్ వేస్తున్నారు. అమ్మ ఒడి అంటున్నారు కానీ 3లక్షల మంది విద్యార్థులు ఎందుకు బయటకు వచ్చారు. డీఎస్సీ ఎప్పుడిస్తారు. దివాలా తీసిన కంపెనీ బైజుస్. సర్క్యూట్ హౌస్ సహా చాలా చోట్ల భూములు, ప్రభుత్వ ఆస్తులు 25వేల కోట్లకు తనకా పెట్టేశారు.
జగన్ను ఆటాడిస్తా..
అక్రమాల ఫైల్ కేంద్రానికి ఇస్తా
విశాఖలో పవన్ వాడివేడి ప్రసంగం
విశాఖపట్నం, న్యూస్లీడర్, ఆగస్టు 10: విశాఖలోని మూడో విడత వారాహి యాత్రలో భాగంగా విశాఖ జగదాంబ వద్ద ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ తనదైన శైలిలోప్రసంగించారు. ఎంతోమంది మేధావులు ప్రజాస్వామ్య రక్షణ కోసం కష్టపడితే… ఒక్కడు వచ్చాడు నాశనం చేయడానికి అంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. జగన్… నువ్వు రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయవు, పోలీసులను, అధికారులను బెదిరిస్తావు… అందరూ నీకు లోబడి ఉండాలని భావించే వ్యక్తివి నువ్వు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ గుర్తుంచుకో… కేంద్రంతో నిన్ను ఆడిరచకపోతే చూడు… మీ నేతల అక్రమాల చిట్టా కేంద్రానికి ఇస్తాను… అప్పుడేం జరుగుతుందో చూడు అంటూ ఘాటు హెచ్చరిక చేశారు. ‘‘ప్రాణాలకు తెగించే రాజకీయాల్లోకి వచ్చా. దేనికీ భయపడను. ఈ నేల కోసం ఏదైనా మంచి చేయాలనే తపనతోనే రాజకీయాల్లోకి వచ్చా. ఎవరి బలిదానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిరదో.. వారి విగ్రహాలు ఉండవు.. కానీ, రాష్ట్రాన్ని దోచుకున్న నేతల విగ్రహాలు మాత్రం కనిపిస్తాయి. దోపిడీలు, దౌర్జన్యాలు చేసే వాళ్లకే ఇంత ధైర్యం ఉంటే.. రాజ్యాంగ విలువలు, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని గుండెల్లో నింపుకొన్న నాకెంత ఉంటుందో ఊహించుకోగలరా? వైసీపీను ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమికొట్టే వరకు, విశాఖ జిల్లాను వైసీపీ విముక్త జిల్లాగా చేసే వరకు జనసేన నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అప్రమత్తంగా ఉండకపోతే ఐదు సంవత్సరాలు భరించాల్సి ఉంటుంది.
10 మంది కలిసి ఇంత దోపిడీ చేస్తున్నారు..
ఎన్ని అబద్ధాలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చాడు. తెలంగాణలో వైకాపా గుంపు భూముల్ని ఎలా దోచుకున్నారో ప్రత్యక్షంగా చూశా. విశాఖలో రుషికొండను ఎలా తవ్వేశారో మనం చూశాం. ఎర్రమట్టి దిబ్బలు తవ్వేసి రియల్ ఎస్టేట్ కోసం వాడుకుంటున్నారు. 10 మంది కలిసి ఇంత దోపిడీ చేస్తున్నారు.. విశాఖలో లక్షలాది మంది ఉన్నారు.. ఎందుకు ఆపలేరు? దేశంలో సహజ వనరులు మనందరివి.. జగన్ కోసం, వైకాపా ఎమ్మెల్యేల కోసం కాదు. రాష్ట్రంలో దాదాపు 30వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చెబితే.. వైకాపా నేతలంతా విమర్శించారు. నేను చెప్పిన తర్వాత పార్లమెంట్లో కేంద్రం ప్రకటించింది. వాలంటీర్లపై నాకు ద్వేషం లేదు. కానీ, మీ ద్వారా డేటా సేకరించిన తీరు రాజ్యాంగ విరుద్ధం. సీఎం జగన్.. అన్నా.. అక్కా.. అంటూ అధికారులను సంబోధిస్తుంటారు. సీఎం.. అన్నా అని పిలిచాడని పొంగిపోయి తప్పులు చేస్తే ఆ తర్వాత పరిణామాలకు మీరే బాధ్యులవుతారు’’ అని పవన్ కల్యాణ్ సూచించారు.