మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమాకి విడుదలకు ముందు కొన్ని అడ్డంకులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఏజెంట్ సినిమా ఫైనాన్స్ విషయంలో తమను మోసం చేశారని చెబుతూ విశాఖపట్నం కి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ అలియాస్ వైజాగ్ సతీష్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కిషోర్ గరికిపాటి తన దగ్గర బ్యాంకు లావాదేవీల రూపంలో 30 కోట్లు తీసుకుని తనకు రాసి ఇచ్చిన అగ్రిమెంట్ అమలు పరచకుండా మోసం చేశారని కోర్టులో కేసు వేయగా రెండు రోజుల పాటు కేసు వాదోపవాదాలు జరిగాయి. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన మొత్తం ఐదు ఐఏలు వేయగా అందులో నాలుగు ఇంటిని డిస్మిస్ చేశారని భోళాశంకర్ డిజిటల్ రైట్స్ కి సంబంధించిన ఐఏ నెంబర్ 304 ని మాత్రం పెండింగ్లో పెట్టారని సతీష్ వెల్లడించారు.
శుక్రవారం సాయంత్రం కోర్టు ఆర్డర్ కాపీ గనక చేతికి వస్తే అందులో పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది ఆయన వెల్లడించారు. అయితే మరో పక్క మెయిన్ సూట్ మాత్రం కోర్టులో కొనసాగుతుందని సెప్టెంబర్ 13వ తేదీన తదుపరి విచారణ జరుగుతుందని వెల్లడించారు. ఇక కోర్టు తీర్పును తాము శిరసావహిస్తామని అయితే తనకు రావలసిన డబ్బులు విషయంలో మాత్రం కోర్టు న్యాయం చేస్తుందని నమ్మకం తమకు ఉందని వెల్లడించారు, కోర్టు ఆర్డర్ కాపీ అందగానే హైకోర్టుకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తామని ఈ సందర్భంగా సత్యనారాయణ వెల్లడించారు. మరోపక్క భోళా శంకర్ విడుదలకు సిద్ధమవుతోంది. మరికొద్ది గంటల్లో భోళా భాయ్ గా మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చూడాలి ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.