అలాంటి వారికి హాట్సాఫ్
ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్స్
న్యూ ఢిల్లీ, న్యూస్లీడర్, ఆగస్టు 10: ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై కౌంటర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. వరుసుగా ట్వీట్ చేశారు. ‘‘కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ… లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి వారికి హాట్సాఫ్’’ అంటూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఉన్నమాటంటే ఉలుకెందుకు?..
సాయిరెడ్డి మరో ట్వీట్
‘‘సినిమాటోగ్రాఫ్ బిల్లుపై పార్లమెంట్లో మాట్లాడితే కోట్లకు పడగెత్తిన కొందరు హీరోలు భుజాలు తడుముకుంటారు ఎందుకో మరి! సినిమా పైరసీని అరికట్టడం ఎంత అవసరమో, సినీ కార్మికుల సంక్షేమం, సినీ పరిశ్రమలో పనిచేసే మహిళల భద్రత కూడా అంతే ముఖ్యం. ఉన్నమాటంటే ఉలుకెందుకు?’’ అంటూ మరొక ట్వీట్ చేశారు.
కొందరు కుట్రదారులు విషం చిమ్ముతున్నారు..
ప్రజలు అప్రమత్తంగా వుండాలంటూ ట్వీట్
ఆంధ్రాపై పెత్తనం కోసం హైదరాబాద్లో ఉండే కొందరు కుట్రదారులు విషం చిమ్ముతున్నారు. హత్యలు చేసైనా ప్రభుత్వంపై వ్యతిరేకత రాజేయాలని కుట్ర పన్నుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని విన్నవించుకుంటున్నా! అంటూ సాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.