సింహాచలం, న్యూస్‌లీడర్, ఆగస్టు 12: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి సింహాచలంలో కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. వారాహి విజయయాత్రలో భాగంగా విశాఖ పర్యటనలో ఉన్న సేనాని శనివారం పెందుర్తి వెళుతూ మధ్యలో సింహాచలంలో అభిమానులను కలిశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జనసేన నాయకుడు మజ్జి సూరిబాబు నేతృత్వంలో కార్యకర్తలు పవన్‌ని కలిసి పంచగ్రామాల భూ సమస్యపై వినతి పత్రం అందజేశారు. వేద పండితులు ఆశీర్వాదం చేశారు.మహిళలు హారతుచ్చారు. పవన్ అందరికీ అభివాదం చూశారు.