స్టార్ హీరోయి న్ సౌత్ ఇండియాలో చక్రం తిప్పిన అందాల భామ జ్యోతిక. నగ్మా 90వ దశకంలో తెలుగు, తమిళ్ భాషలలో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. అక్క వారసత్వంతో జ్యోతిక కూడా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20వ దశకంలో ఏకంగా పదేళ్ల పాటుగా తెలుగు, తమిళ్లో స్టార్ హీరోయిన్గా సక్సెస్ ఫుల్ కెరియర్ ని కొనసాగించింది. హిందీలో కూడా మూవీస్ చేసింది. తరువాత హీరో సూర్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ నటి గా జ్యోతిగా రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలి సిందే. రీఎంట్రీలో ఎక్కువగా ఫీమేల్ సెంట్రిక్ కథలతో సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో నటించే ఛాన్స్ జ్యోతికకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇళయదళపతి విజయ్ లియో పూర్తయిన తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు. ఈ చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ కోసం జ్యోతికని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 20 ఏళ్ళ క్రితం విజయ్, జ్యోతిక ఖుషి మూవీలో నటించారు. పవన్ కళ్యాణ్ ఖుషి మూవీకి అది ఒరిజినల్ వెర్షన్. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తరువాత తిరుమలై చిత్రంలో వీరిద్దరూ మరోసారి జోడీగా నటించారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే 20 ఏళ్ళ తర్వాత వెంకట్ ప్రభు ఈ జోడీని స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడానికి రెడీ అవుతున్నారు.