విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 12: గత అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన జనసేన నేత పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఆ నియోజకవర్గంలో పర్యటించడానికి సమాయత్తమయ్యారు. తొమ్మిది రోజుల పర్యటన కోసం విశాఖ వచ్చిన పవన్ ఆదివారం గాజువాక వెళ్తుండడం పట్ల అందరిలో ఆసక్తి మొదలైంది. వైసీపీ తరపున పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డిపై ఘోరంగా ఓటమిపాలైన పవన్ నాలుగేళ్ళలో ఒక్కసారి కూడా ఈ నియోజకవర్గం వేపు కన్నెత్తికూడా చూడలేదు. గాజువాకలో ఓటమి పవన్‌కు తీవ్ర మనస్థాపాన్ని కలిగించిందని జనసేన పార్టీ శ్రేణులు విశ్లేషించాయి. అప్పట్లో తిప్పల నాగిరెడ్డికి 75,292 ఓట్లు వస్తే పవన్‌కు మాత్రం కేవలం 58539 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇది టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కన్నా 1897 ఓట్లు మాత్రమే ఎక్కువ కావడం విశేషం.