తిరుమల, న్యూస్లీడర్, ఆగస్టు 12: తిరుమలలో శ్రీవాణి దర్శనం టికెట్ల కోసం భక్తులు పోటెత్తారు. భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. కౌంటర్ ఉదయం 8.30 గంటలకు తెరుస్తారు. కేవలం 400 టికెట్లు మాత్రమే ఇస్తారు. టికెట్ ధర రు.10,000, రు.500. అయినా వేలమంది ఈ టికెట్ల కోసం తిరుమల జేఈవో కార్యాలయం వద్ద ఎగబడ్డారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీవారిని దగ్గరగా కనులారా దర్శించుకోవాలన్న కోరిక గల భక్తులకు టీటీడీ శ్రీవాణి ట్రస్టుకు 10 వేల రూపాయలు విరాళమిస్తే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.