ఇండస్ట్రీలో అడుగు పెట్టి సుదీర్ఘ కాలం అయినా కూడా ఇప్పటికి కూడా బిజీగానే ఉంది. గత మూడు నాలుగు సంవత్సరాలు గా తమన్నా కెరీర్ ఆశాజనకంగా లేదని, కమర్షియల్‌గా సక్సెస్ లు దక్కడం లేదని.. ఆమె పనై పోయిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తు న్నారు. కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ బిజీగా ఉంది. సక్సెస్.. ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తమన్నా వరుసగా సినిమాలు, సిరీస్ లతో దూసుకుపోతుంది. సినిమాల్లో ఛాన్స్‌లు తక్కువ ఉన్న సమయంలో సిరీస్‌ల్లో మరియు మ్యూజిక్ ఆల్బంల్లో కూడా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తూ ఉంది. తాజాగా భోళా శంకర్ మరియు జైలర్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జైలర్ సినిమాలో ఈమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత దక్కలేదు. భోళా శంకర్ సినిమా కూడా ఈమె కెరీర్ కు పెద్దగా హెల్ప్ అయింది లేదు. ఆఖ్రీ సచ్ అనే వెబ్ సిరీస్‌తో తమన్నా ఈనెల 25న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఢల్లీిలోని బురారీ మరణ ఘటన ఆధారంగా రూపొం దించిన ఈ వెబ్ సిరీస్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.