పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో అనుమానంతో ఓ వ్యక్తి కన్నకూతుర్ని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత ద్విచక్రవాహనానికి మృతదేహాన్ని కట్టి, ఊరంతా ఈడ్చుకెళ్లాడు. నిందితుడు బౌ ఓ కూలీ.
అతడి కుమార్తె (20) ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి, మరుసటిరోజు తిరిగి వచ్చింది. తీవ్రమైన ఆగ్రహంతో బౌ ఆమెపై విరుచుకుపడ్డాడు. తీవ్రంగా కొట్టి పదునైన ఆయుధంతో దాడి చేయగా ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత మృతదేహాన్ని తన ద్విచక్ర వాహనానికి కట్టి ఊరంతా ఈడ్చుకెళ్లి దగ్గర్లోని రైలు పట్టాలపై పడేశాడు. ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. నిందితుణ్ని అరెస్టు చేసినట్లు డీఎస్పీ కుల్దీప్సింగ్ తెలిపారు.