పుట్టినరోజు వేడుకలకు ఇంటికి పిలిపించి, మత్తుమందు ఇచ్చి ఎస్సై తనపై అత్యాచారం చేసినట్లు బాధిత యువతి బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ బి.రమేష్‌బాబు తెలిపారు.
సీఐ అందించిన సమాచారం మేరకు.. గతంలో అద్దంకి ఎస్సైగా పనిచేసిన సమందర్‌వలీ తాను విధులు నిర్వర్తించే సమయంలో తనను పుట్టినరోజు పేరుతో ఇంటికి పిలిపించాడని, మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని, అశ్లీల చిత్రాలు తీశాడని, వివాహం చేసుకోమని కోరగా చంపుతానని బెదిరించినట్లు అద్దంకి పట్టణానికి చెందిన యువతి ఫిర్యాదులో పేర్కొందన్నారు. ఆమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.