తిరుమల, : గత కొన్ని రోజులుగా పులుల సంచారంతో హడలిపోతున్న శ్రీవారి భక్తులకు తాజాగా కొత్త భయం పట్టుకుంది. తిరుమలలోని శ్రీవారి మెట్టు నడకమార్గంలో ఎలుగుబంటి కనిపించినట్టు కొందరు భక్తులు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయం 2 వేల మెట్టు వద్ద భక్తులకు ఎలుగుబంటి కనిపించింది. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి రావడాన్ని గుర్తించిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు మైక్‌లో అనౌన్స్మెంట్ ఇచ్చి నడకమార్గంలో వస్తున్న భక్తులను అప్రమత్తం చేశారు. అనంతరం ఎలుగుబంటి తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది.