రాజేంద్రనగర్, న్యూస్‌లీడర్, ఆగస్టు 14: మెడికల్ షాప్‌కు వెళ్లి ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బుద్వేల్‌లో చోటు చేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్లకు చెందిన శ్రీనివాస్ (35) రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌కు వలస వచ్చాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం శ్రీనివాస్‌కు ఛాతీలో నొప్పిరావడంతో స్థానికంగా ఉన్న ఓ డాక్టర్ వద్దకు వెళ్లాడు. డాక్టర్ పరీక్షించి అతడికి మందులు రాసిచ్చారు. మందులు కొనుగోలు చేసేందుకు శ్రీనివాస్ మెడికల్ షాప్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలి మృతి చెందాడు.