గాజువాక, న్యూస్‌లీడర్, ఆగస్టు 14: దువ్వాడ పోలీసు స్టేషన్ పరిధిలోని కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. గాజువాక నుంచి అనకాపల్లి వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద ఎపి 31ఇకె 6766బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటారు సైక్లిస్ట్ జారిపడటంతో ట్యాంకర్ వెనుక చక్రాల కిందపడి తలకు తీవ్ర గాయం అయ్యింది. తీవ్ర రక్త స్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని అటాప్సీ కోసం విశాఖ కేజీహెచ్‌కి తరలించి, ప్రమాదానికి కారకుడైన ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.