నటుడు పిచ్చి కేకలు వేస్తే ఫాన్స్ ఈలలు కామన్..
చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నాడు
-వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రతిపక్షాలు పధకం ప్రకారం ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపిస్తున్నారని విమర్శించారు.
గాజువాకలో పవన్ కల్యాణ్ ను ప్రజలు తిరస్కరించారన్నారు. ఏదో పిచ్చి కేకలు వేస్తే ఫ్యాన్స్ ఈలలు వేయడం కామనే అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
పూనకాలు, అరుపులు, తిట్లు తప్ప పవన్ స్పీచ్ లో ఏముంది? అంటూ ఎద్దెవా చేశారు. చంద్రబాబు ఓ విప్లవ పోరాటం చేసినంత బిల్డప్ ఇచ్చారు.
పుంగనూరు, అంగళ్లులో పోలీసులను కొట్టారు, వాహనాలను తగలబెట్టారన్నారు. పోలీసులు సంయమనం పాటించకుంటే ఘోరాలు జరిగేవన్నారు.
ఏదో జరగాలన్నదే చంద్రబాబు ప్లాన్ అన్నారు. చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మళ్లీ ఏదో తనపై దాడి చేసినట్టు రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాయడంలో ఉద్దేశ్యం ఏంటన్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీలోకి సీబీఐ రాకుండా చేశారు. ఇప్పుడేమో సీబీఐతో విచారణ చేయాలంటున్నారు
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అంటూ వ్యాఖ్యానించారు.