దక్షిణాదితో పాటు బాలీ వుడ్‌లోనూ నటి రష్మిక మందన్న జోరు నడుస్తోంది. వరుసగా భారీ సిని మాలతో ఆమె క్షణం తీరిక లేకు ండా ఉంది. అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’, రణబీర్ కపూర్‌తో బాలీ వుడ్లో ‘యాని మల్’ సినిమా చేస్తోంది. ఇప్పుడు ఆమె ఖాతాలో మరో భారీ ఆఫర్ చేరింది. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, తమిళ స్టార్ ధనుష్ కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ధనుష్ కు ఇది 51వ సినిమా.ఈ సినిమాలో ధనుష్ సరసన హీరోయిన్గా రష్మిక మందన్న ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. రష్మికకు స్వాగతం చెబుతూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.