టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. ఫలక్నుమా దాస్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విశ్వక్.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇటీవలే దాస్ కా ధమ్కీ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు విశ్వక్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో అభిమానులతో శుభవార్త పంచుకున్నారు. త్వరలోనే తాను ఓ ఇంటివాడిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
“ఇన్నాళ్లుగా నాపై ప్రేమ చూపిస్తున్న అభిమానులకు.. శ్రేయోభిలాషులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు మీ అందరితో ఒక విషయం పంచుకోవాలని అనుకుంటున్నాను. త్వరలోనే నా జీవితంలో మరో ఘట్టాన్ని ప్రారంభించబోతున్నాను. నేను కొత్త లైఫ్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఆగస్ట్ 15న పూర్తి వివరాలు వెల్లడిస్తాను” అంటూ ఆ నోట్ లో రాసుకొచ్చారు విశ్వక్. అయితే ఈ పోస్ట్ చూస్తుంటే మాత్రం పెళ్లి వార్తలాగే అనిపిస్తుంది.