హైదరాబాద్, న్యూస్‌లీడర్, ఆగస్టు 14: వివేకా హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు సెప్టెంబర్ ఒకటో తేదీకి వాయిదా వేసింది. ఈ విచారణకు వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌కుమార్ యాదవ్‌ను చంచల్‌గూడ జైలు అధికారులు కోర్టులో హాజరు పర్చారు. మరోవైపు నాలుగురోజుల క్రితం దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశించింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేస్తే దానిపై ఈరోజే విచారణ జరిగే అవకాశముంది.