స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అత్తిలి సుధాకర్
గ్యాంగ్‌టక్, న్యూస్‌లీడర్, ఆగస్టు 15: విశాఖ వాసి, సీనియర్ ఐపీఎస్ అధికారి అత్తిలి సుధాకర్‌కు సిక్కిం స్వాతంత్య్ర వేడుకల్లో అత్యున్నత గౌరవం లభించింది. నగరానికి చెందిన ప్రముఖ నాటక రచయిత, ప్రయోక్త అయిన అత్తిలి కృష్ణారావు తనయుడు సుధాకర్ ప్రస్తుతం సిక్కిం హోశాఖలో అడిషనల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో మంగళవారం జరిగిన వేడుకల్లో సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతే కాదు ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ సహా ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఆయనకు అత్యున్నత గౌరవం దక్కింది.