ముంబై, న్యూస్లీడర్, ఆగస్టు 16 : మహారాష్ట్రలోని కొల్హాపూర్లో బుధవారం తెల్లవారుజామున 6:45 గంటలకు భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రత నమోదైంది. ఐదు కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయని తెలిపింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. భూమి కంపించడంతో జనాలు భయపడి ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.