ప్రముఖ వ్యాపారులు, అధికారులతో కలిసి స్వాతంత్య్ర సంబరాలు
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 16: మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ దుబాయ్‌లో సందడి చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో అక్కడి ప్రముఖ వ్యాపారులు, అధికారులతో కలిసి సంబరాలు జరిపారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఇటీవలే ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ‘యూఏఈ, ఇండియా భాయీభాయీ’ అంటూ అక్కడి వారు రవితేజను ఆహ్వనించారు. ఈ కార్యక్రమం వల్ల భారత్, అరబ్ దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక బంధాలు తెలియజేశారు. అనంతరం గంటా రవితేజ మాట్లాడుతూ ప్రపంచంలోని యువత ప్రాముఖ్యత, నైపుణ్యం గురించి వివరించారు. భారత`అరబ్ దేశాల మధ్య నడుస్తున్న వ్యాపార సంబంధాలు మరింత పుంజుకోవాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో ఎత్తయిన ‘బుర్జ్ ఖలీఫా’ 124వ ఫ్లోర్లో ఈ కార్యక్రమాలు జరగడం విశేషం. నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్‌తో పాటు రాజకీయంగానూ రాణిస్తున్న రవితేజను పలువురు ఈ సందర్భంగా అభినందించారు.