యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘‘దేవర’’ కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం గ్రాండ్ యాక్షన్ ఎపిసోడ్స్ భారీ తారాగణం నడుమ తెరకెక్కుతూ ఉండగా గత కొన్ని రోజులు నుంచి అయితే ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తుంది అని టాక్ ఉంది. మరి ఆగస్ట్ 16 ఈ చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ బర్త్ డే కానుకగా ఓ సాలిడ్ అప్డేట్ ని అందించే ఛాన్స్ ఉందని బజ్ వచ్చింది. మరి దీనిపై అయితే ఇప్పుడు మేకర్స్ అఫీషి యల్ అప్డేట్ని లేటెస్ట్గా అందించారు. సైఫ్ అప్డేట్ రివీల్ చేస్తున్నట్టు గా ఇప్పుడు ఫిక్స్ చేశా రు. మరి ఈ అప్డేట్ ఏం టో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీ తం అందిస్తుండగా ఎన్టీ ఆర్ ఆర్ట్స్ సహా యువ సుధ ఆర్ట్స్ వారు నిర్మా ణం వహిస్తున్నారు.