సాధారణంగా యాంకర్లు అంటే బుల్లితెరపైనే ఎక్కువగా సందడి చేసేవారు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం చాలా మంది భామలు ప్రైవేటు కార్యక్రమాల పైనే ఫోకస్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. అందులో మంజూష రాంపల్లి ఒకరు. చాలా కాలం క్రితమే ఈ రంగంలోకి ఎంటరైన ఈ భామ.. ఏ యాంకర్‌కూ సాధ్యం కాని రీతిలో ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్లో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే మంజూష తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి! అప్పట్లోనే సందడి చేసి: మంజూష రాంపల్లి ముందుగా మోడలింగ్ రంగంలో సత్తా చాటింది. అందులో తనదైన అందచందాలతో మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ సమయంలోనే పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెరపై ఎన్నో షోలను హోస్ట్ చేసింది. దీంతో మంజూష రాంపల్లికి తెలుగులో సీరియళ్లు, సినిమాల్లో సైతం చాలా ఆఫర్లు వచ్చాయి. ఎన్టీఆర్ చెల్లిగా జీవించి: యాంకర్‌గా అప్పు డప్పుడే ఎదుగుతోన్న సమయంలో మంజూషకు ఎన్నో సినిమాల్లో నటిం చే ఛాన్స్ లభించింది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ – కృష్ణ వంశీ కాంబినేషన్లో వచ్చిన ‘రాఖీ’లో నటించే అవకాశం అందు కుంది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష.. అందులో జీవించేసింది. ఫలితంగా ఆమెకు మంచి పేరు, ప్రశంసలు, అవార్డులు లభించాయి. ఏకైక యాంకర్‌గా రికార్డ్: హోస్టుగా కెరీర్ మొదలెట్టిన కొత్త ఎన్నో షోలను నడిపించిన మంజూష.. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఇందులో భాగంగానే సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ ఫుల్ బిజీగా గడిపింది. ఇలా రికార్డు స్థాయిలో 5000కు పైగా ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేసింది. తద్వారా మంజూష రికార్డును కూడా అందుకుంది. చాలా కాలంగా యాంకర్ మంజూష వరుస పెట్టి సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్నప్పటికీ.. సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్లో సందడి చేస్తోంది.