విశాఖలోని స్పోర్ట్స్ జర్నలిస్టులతో
ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి ఇంటరాక్షన్
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 16: ఏపీలో క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్`2) బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 27వ తేదీ వరకు విశాఖలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ, వీడీసీి క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌లో జరగనున్నాయి. ఏపీఎల్ సీజన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్ గోపీనాథ్ రెడ్డి బుధవారం ఉదయం బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో విశాఖలోని స్పోర్ట్స్ జర్నలిస్టులతో ఇంటరాక్షన్ అయ్యారు. ఏపీఎల్`2 సీజన్ వివరాలు వెల్లడిరచారు. ఈ టోర్నీలో మొత్తం ఆరు టీమ్స్ తలపడనున్నాయి, ఈ ఆరు జట్లు రౌండ్ రాబిన్ ఫార్మాట్లో తలపడతాయి, లీగ్ దశలో ఉన్న మొదటి నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కి వెళ్తయి, మిగతావి నిష్క్రమిస్తాయన్నారు. లీగ్ దశ ముగిసిన తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్ ఈ నెల 25వ తేదీన ఉండగా, క్వాలిఫైయర్-1 25న, క్వాలిఫైయర్-26న జరుగుతాయి, 27వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఫైనల్ మ్యాచ్ ఉంటుందన్నారు. ఈ ఏడాది ఏపీఎల్ సీజన్`2ను పెద్ద ఎత్తున నిర్వహించాలన్న లక్ష్యంతో యువ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ‘మన ఆంధ్ర మన ఏపీఎల్’ రన్ పేరిట విజయవాడ, విశాఖలోని మెగా రన్‌ను దిగ్విజయంగా నిర్వహించామన్నారు. ఏపీఎల్‌లో 120 మంది ఆంధ్ర యువ క్రికెటర్లు పాల్గొంటున్నారని వెల్లడిరచారు. రాష్ట్రంలోనే ఇది అతిపెద్ద ఈవెంట్ అన్నారు. రాష్ట్రంలో ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఏసీఏ అధ్యక్షులు పి.శరత్ చంద్రారెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ఆయన నాయకత్వంలో మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. యువ క్రికెటర్లలో ఉన్న ప్రతిభను గుర్తించడంతో పాటు ఆర్థికంగా ఐపీఎల్ ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. రాష్ట్ర క్రికెటర్లు ఐపీఎల్లో ఆడే అవకాశం రావాలన్నదే తమ లక్ష్యమని, అందుకు ప్రణాళికల సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. క్రికెట్ అభిమానులు ఏపీఎల్`2 సీజన్‌ను ఆదరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.