. బీజేపీ కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమం . మాజీ ప్రధానికి పలువురి నివాళి
విజయవాడ, న్యూస్లీడర్, ఆగస్టు 16 : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వాజ్పేయి చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ సేవకు వాజ్పేయి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. బీజేపీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనదేనని చెప్పారు. సుపరిపాలన అంటేనే వాజ్ పేయి గుర్తొస్తారని అన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలను నిర్వహించిన ధైర్యవంతుడని చెప్పారు. చిన్న వయసులోనే సామాజిక కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. అటల్ స్ఫూర్తితో యువత పని చేయాలని పిలుపునిచ్చారు. వాజ్పేయి చూపిన మార్గంలో నడుస్తామని అన్నారు.