. వధువు నర్సాపురానికి చెందిన పుష్పవల్లి . 19న ఎంగేజ్మెంట్.. అక్టోబర్లో పెళ్లి . ఏలూరు మున్సిపల్ మాజీ ఛైర్మన్ జక్కం అమ్మాని, బాబ్జీల కుమార్తె పుష్పవల్లి
విజయవాడ, న్యూస్లీడర్, ఆగస్టు 16 : వంగవీటి వారింట త్వరలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. దివంగత వంగవీటి రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. నర్సాపురం పట్టణానికి చెందిన పుష్పవల్లితో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమైనట్టు అతని కుటుంబసభ్యులు తెలిపారు.
నర్సాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జక్కం అమ్మాని, బాబ్జీల చిన్న కుమార్తె పుష్పవల్లి. ఈ నెల 19న నర్సాపురంలో రాధాకృష్ణ, పుష్పవల్లిల ఎంగేజ్మెంట్ నిర్వహించనున్నారు. అక్టోబర్లో వీరి వివాహం ఉంటుంది.
రాధా పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే సమాచారంతో వంగవీటి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. తాము ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమయిందని అంటున్నారు. రాధా పెళ్లి సమాచారం రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తిని రేపుతోంది.