భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ భారత్-నేపాల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలోని అభిమానులకు మిడిల్ ఫింగర్ చూపించాడు. ఇప్పుడీ వ్యవహారం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతోంది.
ఆ వీడియోలో అభిమానులకు గౌతమ్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ అసహనం వ్యక్తం చేయడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారం మరింత వివాదాస్పదం అవడం, తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండటంతో.. తాజాగా గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఈ వీడియోపై క్లారిటీ ఇచ్చాడు. అసలు విషయం ఏంటో వివరించాడు.
తాను వెళ్లే సమయంలో మైదానంలో ఉన్న కొందరు పాక్ అభిమానులు భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని గౌతమ్ గంభీర్ క్లారిటీ ఇచ్చాడు. దానికి తనదైన శైలిలో జవాబిచ్చానని తెలిపాడు. ‘పాక్ అభిమానులు కొందరు.. భారతదేశానికి వ్యతిరేక నినాదాలతో పాటు.. కశ్మీర్ గురించి కూడా నినాదాలు చేస్తున్నారు. అందుకే అలా రియాక్ట్ అయ్యాను. నా స్టైల్లో సమాధానం చెప్పాను. ఎవరైనా భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేసినా, భారత్కు వ్యతిరేకంగా మాట్లాడినా నేను ఖచ్చితంగా స్పందిస్తాను.’ అని భారత మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.
కానీ.. కోహ్లీ అభిమానులకే గంభీర్ అలా మిడిల్ ఫింగర్ చూపించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ అభిమానుల పట్ల ఇలాగే రియాక్ట్ విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. అహంకారం ప్రదర్శిస్తున్నాడంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రియాక్ట్ అయిన గౌతమ్ గంభీర్.. వివాదంపై క్లారిటీ ఇచ్చాడు.
Here is the real audio clip you can clearly listen to what they are saying.#GautamGambhir You are Proud Indian 🇮🇳🔥 Dho Dala Pakistaniyon ko 😂 pic.twitter.com/xq5vV5tSsW
— Atul Singh Shanu 🔥 (@Mafiya_Singh11) September 4, 2023