ఆసియా కప్ -2023లో పాకిస్థాన్‌పై తొలి మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ నిరాశపర్చింది. రెండో మ్యాచ్‌లో బౌలింగ్‌లో తేలిపోయింది. నేపాల్ లాంటి పసికూన జట్టును కుప్పకూల్చలేకపోయిన టీమిండియా బౌలింగ్ వైఫల్యం కనిపించింది… మధ్యలో వాన… అయితే ఎట్టకేలకు సాధికారిక బ్యాటింగ్‌తో ఉత్కంఠ లేకుండా భారత్ మ్యాచ్ ముగించింది. కుదించిన పోరులో అలవోక విజయంతో ‘సూపర్–4’ దశకు ముందంజ వేసింది.
మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. ఆసిఫ్ షేక్ (58 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 97 పరుగులు చేయగా.. సోంపాల్ కామి 48 పరుగులు చేశాడు. అనంతరం వాన కారణంగా భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్దేశించారు. అయితే భారత్ 20.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 147 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ 59 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టి 74 పరుగులు చేయగా.. శుబ్‌మన్ గిల్ 62 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 67 పరుగులు చేశాడు.
మ్యాచ్‌లో భారత్ గెలిచినా.. నెటిజన్ల నుంచి అక్షింతలు తప్పలేదు. సునాయాస క్యాచ్‌లు వదిలేయడం, మిస్‌ఫీల్డింగ్, రనౌట్ అవకాశాలు చేజార్చడం, ఓవర్‌త్రోలు… ఇవన్నీ సోమవారం భారత ఫీల్డింగ్‌లో కనిపించాయి. మైదానంలో మన ఆటగాళ్లు ఇంత పేలవంగా కనిపించడం ఆశ్చర్యపర్చింది. తొలి 4.2 ఓవర్లు ముగిసేసరికి భారత ఆటగాళ్లు మూడు క్యాచ్‌లు వదిలేశారు. షమీ బౌలింగ్‌లో భుర్తేల్ ఇచ్చిన క్యాచ్‌లను శ్రేయస్, కిషన్ వదిలేయగా, సిరాజ్ బౌలింగ్‌లో ఆసిఫ్ క్యాచ్‌ను కోహ్లి వదిలేశాడు. చివర్లో సోంపాల్ క్యాచ్‌నూ కిషన్ అందుకోలేకపోయాడు.