ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ప్రజలు సంబరాలు చేసుకుంటారని.. కచ్చితంగా ఆయన జైలుకి వెళ్తారని మంత్రి ఆర్కే రోజా జోస్యం చెప్పారు. ఐటీ శాఖ రూ.118 కోట్ల ముడుపుల వ్యవహారంపై చంద్రబాబుకి నోటీసులు ఇవ్వడంపై మాట్లాడుతూ ‘‘రూ.118 కోట్ల ముడుపుల కేసులో విచారణ ఎదుర్కోనే దమ్ముందా లేదా చంద్రబాబు? లేదా మీ బావమరిది బాలకృష్ణలా మెంటల్ సర్టిఫికెట్ తెచుకుంటావా? అని మంత్రి రోజా ప్రశ్నించారు.
కేసుల్లో అడ్డంగా దొరికిపోవడంతో విజయ్ మల్యా తరహాలో విదేశాలకు అతను పారిపోయే అవకాశం ఉంది. చంద్రబాబు, లోకేష్‌లను జైలులో పెడితేనే ప్రజలకు మేలు. బాబు అడ్డంగా దొరికిపోయినప్పుడు సింపతి డ్రామాలు ఆడటం అలవాటు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి రాష్ట్రానికి పారిపోయి వచ్చాడు.
చంద్రబాబు మీద అలిపిరిలో బాంబు పేలినప్పుడే ఆయనకి సింపతి రాలేదు. బాబు అంటే ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది అని మంత్రి రోజా గుర్తు చేశారు. 2019లో ఎన్నికల ముందు మోదీ నన్ను అరెస్ట్ చేస్తారని కూడా చంద్రాబు సింపతి డ్రామా ఆడాడు. రూ.118 కోట్ల ముడుపుల కేసులో చంద్రబాబుని కచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఈ కేసులో సీబీఐ, ఈడీ కూడా విచారణ చేయాలి అని మంత్రి రోజా డిమాండ్ చేశారు.