ఈరోజుల్లో అధికబరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. ఇక ఈ బరువును తగ్గాలని అనుకొనేవారు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. అయితే కొన్నిసార్లు వర్కౌట్ కావు.. ఇక చేసేదేమి లేక బాధపడతారు.. అలాంటి సమస్య ఉన్నవాళ్ళు..టిఫిన్ కు బదులుగా ఈ జ్యూస్ ను తాగితే అధిక సమస్య ఇట్టే మాయం అవుతుందని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం రెండు క్యారెట్ లను, ఒక చిన్న బీట్ రూట్ ను, ఒక ఆపిల్ ను, 4 ఖర్జూర పండ్లను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా క్యారెట్ లను శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకోవాలి. అదే విధంగా బీట్ రూట్ పై ఉండే చెక్కును తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఆపిల్ ను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒక జార్ లో వేసుకోవాలి.తరువాత ఖర్జూర పండ్లను గింజలు తీసేసి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి కలపాలి. ఈ జ్యూస్ ను నేరుగా ఇలాగే తాగవచ్చు లేదా వడకట్టుకుని కూడా తాగవచ్చు. రోజూ ఉదయం పూట ఈ జ్యూస్ ను తీసుకోవాలి.
ఆ తరువాత మొలకెత్తిన గింజలను లేదా డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకోవాలి. ఇలా ఉదయం పూట ఇడ్లీ, దోశ, పూరీ వంటి ఇతర అల్పాహారాలను మానేసి ఇలా జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు… అలాగే జంక్ ఫుడ్ కు, నూనెలో వేయించిన చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.. బరువు తగ్గడంతో పాటు ఈ జ్యూస్ ను తాగడం వల్ల రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది.
మలబద్దకం సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ జ్యూస్ ను తయారు చేసుకుని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. బీపీ అదుపులో ఉంటుంది… ఇంకా ఎన్నోhప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు..