ఆసియా కప్-2023లో భారత్, పాక్‌లను వర్షం వెంటాడుతూ ఉంది. టోర్నీలో జరగాల్సిన గ్రూప్ లెవెల్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దు కాగా.. సూపర్-4 దశలో జరగాల్సిన మ్యాచ్ రిజర్వ్ డే (ఈరోజుకి) వాయిదా పడింది. రిజర్వ్ డే రోజున అయినా మ్యాచ్ సాఫీగా సాగుతుందా అంటే అది చెప్పలేని పరిస్థితి. కొలొంబో వాతావరణ శాఖ వారి హెచ్చరికల ప్రకారం రేపు 99 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది.
దీనికి తోడు భారత్‌కు రిజర్వ్ డే బ్యాడ్‌లక్ కూడా కలవరపెడుతుంది. రిజర్వ డే రోజు భారత్ పాక్‌పై ఒక్క మ్యాచ్ కూడా గెలిచింది లేదు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ చివరిసారిగా రిజర్వ్ డే రోజున మ్యాచ్ ఆడి ఓటమిపాలైంది. నాడు మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్‌కప్ సెమీఫైనల్స్ భారత్ పరాభవాన్ని ఎదుర్కొంది.
ఇది చాలదన్నట్లు రిజర్వ్ డే మర్నాడే (సెప్టెంబర్ 12) భారత్.. శ్రీలంకతో కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. వరుసగా మూడు రోజుల పాటు ఫీల్డ్‌లో ఉండి గెలవటం ఎంతటి జట్టుకైనా పెద్ద పనే అవుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మ్యాచ్‌లో పాక్‌పై పైచేయి సాధిస్తుందో లేదో వేచి చూడాలి.
నిన్న జరగాల్సిన భారత్-పాక్ సూపర్ 4 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఈరోజు రిజర్వ్ డే కావడంతో ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ పూర్తి 50 ఓవర్ల మ్యాచ్‌గా సాగనుంది. వర్షం కారణంగా ఇవాల్టి ముగిసే సమయానికి భారత్ స్కోర్ 24.1 ఓవర్లలో 147/2గా ఉంది. రోహిత్ (56), గిల్ (58) ఔట్ కాగా.. కోహ్లి (8), రాహుల్ (17) క్రీజ్‌లో ఉన్నారు.