ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను టీమ్ఇండియా చిత్తు చేసింది. వర్షం కారణంగా రెండు రోజులపాటు సాగిన వన్డే మ్యాచ్‌లో ఫలితం భారత్ తిరుగులేని విజయాన్ని అందుకుంది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2023 సూపర్ -4లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై భారత్ 228 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 2 వికెట్ల నష్టానికి 356 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 32 ఓవర్లలో 128/8 స్కోరు వద్ద ఉన్నప్పుడు.. చివరి బ్యాటర్లు బ్యాటింగ్‌కు రాకపోవడంతో ఆలౌట్‌గా పరిగణించడం జరిగింది. కుల్దీప్ యాదవ్ 25 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. ఈ విజయంతో సూపర్ -4 పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఈరోజే శ్రీలంకతో ఇదే స్టేడియంలో మరో పోరుకు భారత్ సిద్ధం కావాల్సి ఉంది.
భారత్ నిర్దేశించిన 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను బుమ్రా ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఇమామ్ వికెట్ తీసిన బోణీ కొట్టిన భారత్.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లను ఎక్కువగా క్రీజ్‌లో కుదురుకోనీయలేదు. ఏ దశలోనూ లక్ష్యం దిశగా పాక్ ఇన్నింగ్స్ సాగలేదు. దీని కారణం మాత్రం కుల్దీప్ యాదవ్ , హార్దిక్ పాండ్య, బుమ్రా, ఠాకూర్‌తో కలిసి సమష్టిగా వికెట్లు తీయడమే.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ , రోహిత్ శర్మ అర్ధశతకాలతో అదరగొట్టే ఆరంభం ఇచ్చారు. అయితే, స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో భారత అభిమానులు ఆందోళనకు చెందారు. అయితే, రిజర్వ్‌డేకు వచ్చిన మ్యాచ్‌లో అభిమానులను ఆనందపరుస్తూ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ సెంచరీలతో అలరించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 233 పరుగులు జోడించారు. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగిన కేఎల్ రాహుల్ ఎంతో సాధికారికంగా ఆడాడు. ఇక విరాట్ కోహ్లీ ఆరంభంలో కాస్త నిదానంగా ఆడినా.. ఒక్కసారి కుదురుకున్నాక చెలరేగిపోయాడు. ఈ క్రమంలో కెరీర్లో 47వ వన్డే శతకం పూర్తి చేసుకోవడ విశేషం. పాక్ బౌలర్లు షహీన్, షాదాబ్ చెరో వికెట్ తీశారు.